ముంబైలో భారీ అగ్నిప్రమాదం…. రంగంలోకి 18 ఫైరింజన్లు

supముంబైలో ఫోర్ట్ ఏరియాలోని పటేల్ చాంబర్స్ బిల్డింగ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు బిల్డింగ్ అంతా వ్యాపించాయి. మంటలను ఆర్పేందుకు 18 ఫైరింజన్లు, 11 ట్యాంకర్లు, 150 ఫర్ ఆఫీసర్లు రంగంలోకి దిగాయి. తెల్లవారుజామున ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఫైరింజన్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే సమయంలో బిల్డింగ్ కూలి ఇద్దరు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. అందరూ సేఫ్ గానే ఉన్నారని, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని వారు తెలిపారు. పరిస్ధితి అదుపులో ఉన్నట్లు తెలిపారు.


Posted in Uncategorized

Latest Updates