ముంబైలో భారీ వర్షాలు : ఎగసిపడుతున్న అలలు

ముంబైలో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థంగా మారుతోంది. ఆదివారం (జూలై-15) సముద్రం నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలలకు వాహనదారులు తడిసి ముద్దైపోతున్నారు. శివారు ప్రాంతాలైన థానే, కల్యాణ్, డోంబివిలీల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది.

కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా… ఇవాళ ఒక్కరోజే 37.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు ఐఎండీ తెలిపింది. మరో 24 గంటలపాటు భారీ వర్షసూచన ఉందని ముంబైవాసులను హెచ్చరించింది ఐఎండీ. సముద్రం ఉగ్రరూపం దాల్చుతూ 5 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. సముద్ర పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Posted in Uncategorized

Latest Updates