ముంబైలో భారీ వర్షాలు : సిటీనే సముద్రం అయిపోయింది

ముంబై సిటీని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎక్కడ చూసినా  నీళ్లే. లోతట్టు ప్రాంతాలకు, రోడ్లకు తేడా లేకుండా పోయింది. సముద్రానికి సిటీకి తేడా లేకుండా ఉంది. నాలుగు రోజులుగా ఆగకుండా పడుతున్న వర్షంతో.. జనజీవనం అస్తవ్యస్థం అయ్యింది. ఇళ్ల  నుంచి ప్రజలు  బయటికి రాలేని  పరిస్థితి. నాలుగు రోజులుగా  కంటిన్యూగా  కురుస్తున్న వర్షాలతో..  రోడ్లు  చెరువులను తలపిస్తున్నాయి.  స్కూళ్లకు  సెలవు ప్రకటించింది మహారాష్ట్ర  ప్రభుత్వం. మరో 24 గంటలు ఇలానే వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.

పాల్ఘర్ లోని  చాలా  ఇళ్లలోకి  నీరు ప్రవేశించింది.  భారీ వర్షాలకు  వరద  పెరిగిపోవడంతో ముంబైలోని  లోతట్లు ప్రాంతాలు పరేల్, ధరావి, కింగ్స్ సర్కిల్, ముంబై  పరిసర పట్టణాలు దివా, దోంబివాలి, కల్యాణ్, అంబర్ నాథ్  నీట మునిగాయి. ముంబై పరిసర ప్రాంతాల్లో 26 వాతావరణ  స్టేషన్లు ఉండగా.. వాటిలో 14 స్టేషన్ల పరిధిలో 10 సెంటీ మీటర్ల  కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎక్కువగా ఛంబర్ ప్రాంతంలో.. 18.4 సెంటీ మీటర్ల  వర్షం పడిందని చెప్పారు. ఓవరాల్ గా ముంబై సిటీలో 16.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. ముంబై శివారు ప్రాంతాల్లో 18.4 సెంటీ మీటర్ల  వర్షపాతం రికార్డ్ అయిందని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు.

వాడాలా రైల్వేస్టేషన్ దగ్గర రైలు పట్టాలు నీట మునిగాయి. దీంతో లోకల్ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షం  కారణంగా  విజిబిలిటీ  తగ్గిపోవడంతో… రైళ్లు కాస్త  ఆలస్యంగా నడుస్తున్నాయి . దూర ప్రాంతాల  నుంచి  వస్తున్న రైళ్ల ను ఆపివేశారు. ఇతర  ప్రాంతాలకు  వెళ్లే   రైళ్లు  కూడా  ఆలస్యంగా నడుస్తున్నాయి.  నల్లాసొపార ఏరియాలో …లోకల్  ఏసీ  ట్రైన్స్ ను  రద్దు చేశారు.

Posted in Uncategorized

Latest Updates