ముంబైలో రూ.91 దాటిన పెట్రోల్ రేట్

ముంబై: పెట్రోల్, డీజిల్ ధరలు ఈ వారం కూడా హైక్ తోనే మొదలయ్యాయి. దాదాపు అన్ని నగరాల్లోనూ పెట్రోల్ రేట్ మునుపటి ధరను దాటింది. ముంబై మహానగరంలో పెట్రోల్‌ ధర రూ.91 దాటింది. సోమవారం పెట్రోల్ రేట్ 24 పైసలు పెరిగి… 91 రూపాయల 8 పైసలుగా ఉంది. లీటర్ డీజిల్ కూడా 32 పైసలు పెరగడంతో.. రేట్ రూ.7972ను చేరింది. రేపో మాపో… లీటర్ డీజిల్ ధర ముంబైలో 80 రూపాయలు దాటనుంది.

ఢిల్లీలో సోమవారం లీటర్ పెట్రోల్ రేట్ రూ.83.73గా ఉంది. ఇవాళ ఇక్కడ 24 పైసలు పెరిగింది. లీటరు డీజిల్‌ రేట్ 75రూపాయల 9 పైసలయ్యింది.

హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రేట్ 26 పైసలు పెరిగింది. డీజిల్ 33 పైసలు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.88.77, లీటర్ డీజిల్ రూ.81.68 ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ 24 పైసలు పెరిగి రూ.84.40గా ఉంది. బెంగలూరులో లీటర్ డీజిల్ 31 పైసలు పెరిగి రూ.75.48గా ఉంది.

ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరల్లో పెరుగుదల కారణంగా.. దేశీయ చమురు కంపెనీలు పెట్రో రేట్లను పెంచుకుంటూ పోతున్నాయి. యూఎస్ డాలర్ తో పోల్చితే రూపాయి విలువ తగ్గిపోతుండటం కూడా పెట్రో రేట్లను ప్రభావితం చేస్తోంది. ఢిల్లీలో సబ్సిడీ లేని వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర ఆదివారం ఒకేసారి రూ.59 పెరిగింది. ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ నుంచి పెట్రోల్‌ ధరలు 8శాతం పెరగగా, డీజిల్‌ ధరలు 10శాతం పెరిగాయి.

 

Posted in Uncategorized

Latest Updates