ముంబై ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో అగ్నిప్రమాదం జరిగింది. అంధేరీలోని కామ్ గర్‌ ESI ఆస్పత్రిలోని మూడో అంతస్థులో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 5గురు మృతి చెందగా…100 మందికిపైగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎనిమిది అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. మంటల్లో చిక్కుకుపోయిన  పలువురు రోగులు, ఆస్పత్రి స్టాప్ ను అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates