ముంబై నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్: నలుగురు ముఠా సభ్యుల అరెస్ట్

దిెంతహైదరాబాద్ డ్రగ్స్ దందాకు అడ్డాగా మారుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్టతో పాటు నగర శివారు ప్రాంతాలపై డ్రగ్స్ మాఫియా ఫోకస్ చేసింది. హైఫై పీపుల్స్ ఉండటంతో ఈ ఏరియాలను టార్గెట్ చేసుకొని దందా చేస్తున్నాయి డ్రగ్స్ ముఠాలు. తాజాగా సనత్ నగర్ లో మరో ముఠా పోలీసులకు పట్టుబడింది.

మహ్మద్ అలామ్, ఇమామ్ అలీ, షమిమ్ అలామ్, అలీఖాన్ ఓముఠాగా ఏర్పడి.. డ్రగ్స్ దందా మొదలు పెట్టారు. ముంబైలో తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి… సిటీలోని రెస్టారెంట్లు, క్లబ్స్, పబ్బులకు ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాపై నిఘా పెట్టిన పోలీసులు..పక్కా సమాచారంతో నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 13 గ్రాముల కొకైన్, 9 గ్రాముల ఎండీఎంఏ, 8 గ్రాముల హెరాయిన్ తో పాటు 7 సెల్ ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు ఎంత ఎంత నిఘా పెట్టినా డ్రగ్స్ మాత్రం సిటీకి చేరుతోంది. సిటీలో వరుసగా డ్రగ్స్ ముఠాలు పట్టుబడుతుండటంతో నగర శివార్లపై ఫోకస్ పెట్టారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates