ముంబై ప్లేఆఫ్ ఆశలు ఆవిరి : 11 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం

DELIPLలో భాగంగా ఆదివారం(మే-20) ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదికగా ముంబై ఇండియన్స్-ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో 11 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై టీమ్ 3 బంతులు మిగిలి ఉండగానే ఆల్ అవుట్ అయింది. ఈ మ్యాచ్ లో ఓడిపోవడంతో ముంబైకి ప్లేఆఫ్ ఆశలు ఆవిరిపోయాయి. రిషబ్ పాంట్ 44 బంతుల్లో 64 పరుగులు చేసి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Posted in Uncategorized

Latest Updates