ముంబై మళ్లీ మునిగింది : ప్రజలను హడలెత్తిస్తున్న కుండపోత వర్షాలు

mumbai-rainsముంబై.. ముంబై.. ముంబై అని నిత్యం హోరెత్తించే సిటీ ఇప్పుడు.. హడలిపోత్తిపోతోంది. బుధవారం అర్థరాత్రి నుంచి పడుతున్న కుండపోత వర్షానికి ముంబై మునిగిపోయింది. రోడ్లు జలమయం అయ్యాయి. ఇవి రోడ్లా.. నదులా అన్నట్లు మారిపోయాయి వీధులు. ఎక్కడ చూసినా నీళ్లే. మరో 48 గంటలు ఇదే స్థాయిలో వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కనీసం 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. అంటే 2005 తర్వాత.. ఆ స్థాయిలో ఇప్పుడు మళ్లీ వానలు పడుతున్నాయి.

భారీ వర్షానికి బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. రోడ్లపై నీళ్లతో సర్వీసులు తిరగటం లేదు. ముంబై రవాణాకి గుండె అయిన సబర్బన్ రైళ్లు.. లోకల్ రైళ్లు షెడ్యూల్ మారిపోయింది. రైలు పట్టాలపై నీళ్లు ప్రవహిస్తుండటంతో.. చాలా రూట్లలో సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. మరికొన్ని రూట్లలో నిదానంగా నడుస్తున్నాయి. ఇక ముంబై ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్ రన్ వే పైకి నీళ్లు వచ్చాయి. దీంతో లండన్ – ముంబై విమానాన్ని అహ్మదాబాద్ తరలించారు. మరికొన్ని విమాన సర్వీసులు రద్దు చేశారు. మరో రెండు రోజులు ఇలాంటి పరిస్థితే ఉంటుందని ఎయిర్ పోర్ట్ అథారిటీస్ ప్రకటించారు.

భారీ వర్షాలకు ముంబైలోని కొలాబా, వర్లీ, మలార్, ట్రోమ్ బే, గడ్కోపా ఈ ప్రాంతాలు నీట మునిగాయి. సహాయక చర్యల కోసం నేవీ ఫ్లడ్ రెస్కూ టీం రంగంలోకి దిగాయి. థానేలోని 35 లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయని.. ఈయా ప్రాంతాల్లో సహాయ చర్యలకు NDRF బృందాలు కూడా రంగంలోకి దిగినట్లు ప్రకటించింది ముంబై మున్సిపల్ కార్పొరేషన్. అత్యవసర సేవల కోసం ముంబైలో ఉన్న వారు 1916 కు డయల్ చేయాలని, ముంబై సిటీ ఒయట ఉన్నవారైతే 1077 కు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు. ముంబై టెంపరేచర్ కూడా 25 డిగ్రీలకు పడిపోయింది.

Posted in Uncategorized

Latest Updates