ముంబైలో మళ్లీ మంటలు : నిర్మాణంలో ఉన్న భవనంలో ఫైర్ యాక్సిడెంట్

ముంబైలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవలే తిలక్ నగర్ లో ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. ఇవాళ శనివారం ఉదయం.. కమలా మిల్స్ కాంపౌండ్ దగ్గర్లో మరో ఫైర్ యాక్సిడెంట్ స్థానికులను టెన్షన్ పెట్టింది. నిర్మాణంలో ఉన్న భవనంలో మంటలు చెలరేగాయి. ఎనిమిదో ఫ్లోర్ లో మంటలు రావడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 5 ఫైరింజన్లతోస్పాట్ కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. నిర్మాణంలో ఉన్న భవనం కావడంతో ప్రాణ నష్టం జరగలేదు. బుధవారం తిలక్ నగర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు  చనిపోయారు.

Posted in Uncategorized

Latest Updates