ముక్కుకు ట్యూబ్ తోనే ప్రాజెక్ట్ పరిశీలన.. పారికర్ వైరల్ ఫొటో

గోవా ముఖ్యమంత్రి, మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చాన్నాళ్ల తర్వాత కెమెరాలకు కనిపించారు. జీర్ణగ్రంథి సమస్యతో కొన్ని నెలలుగా .. తన ఇంటిలో చికిత్స తీసుకుంటున్న పారికర్… ఆదివారం డిసెంబర్ 17న బయటకు వచ్చారు. మండోవి నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జీ, జౌరీ బ్రిడ్జీ పనులను పరిశీలించారు. ఈ బ్రిడ్జీ నిర్మాణ పనులపై గోవా ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ , ఎల్ అండ్ టీ అధికారులతో సమీక్ష జరిపారు. రాజధాని పనాజీని… ఉత్తర గోవాతో కలిపే ఈ బ్రిడ్జి నిర్మాణం.. వచ్చే ఏడాది పూర్తి అవుతుంది.

63 ఏళ్ల మనోహర్ పారికర్… ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స తీసుకున్న తర్వాత గోవాకు వచ్చారు. అక్టోబర్ 14న పనాజీలో చివరిసారి మీడియాకు కనిపించారు. మళ్లీ  ఆదివారమే ఆయన జనం ముందుకొచ్చారు. కారునుంచి దిగిన తర్వాత మనోహర్ పారికర్ ను చూసినవాళ్లంతా కొంత షాకయ్యారు. ముక్కుకు ట్యూబ్ తో ఆయన ఉన్నారు. ఆయన మరో వ్యక్తి సాయంతో నడిచారు. ఆయన వెంట ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు.

పారికర్ ఫొటోలను చూసిన నెటిజన్లు… అధికారులు ఆయన్ను బయటకు రాకుండా చూడాల్సిందని అన్నారు. పనుల పరిశీలనకు పిలవడం… అధికారులు ఆయనకు వివరించడం.. ఇదేమన్నా తమాషా అనుకుంటున్నారా… ఇంతటి అమానుషం ఎక్కడా చూడలేదని కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశాడు. దీనికి బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా కౌంటరిచ్చారు. ఓ నాయకుడి నిబద్ధత, అంకితభావాన్ని చూసి తమాషాగా మాట్లాడొద్దని.. అలాంటి కమిట్ మెంట్ చాలా తక్కువమందికి ఉంటుందని అన్నారు. ఐతే… ఈ బ్రిడ్జీ నిర్మాణం… పారికర్ కు ఇష్టమైన ప్రాజెక్ట్ అని.. అందుకే నిర్మాణ పనులను ఆయన స్వయంగా పరిశీలించారని అధికారులు చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates