ముక్కు.. ముక్కలైంది : మద్యానికి డబ్బులివ్వలేదని కొరికేశాడు

DDతాగి వచ్చి భార్యను కొట్టేవాళ్లని చూశాం. తాగుడుకు బానిసలైన వాళ్లు మద్యం కొనుక్కునేందుకు డబ్బులు లేకపోతే ఇంట్లో ఉన్నవారిపై దాడులు చేసిన ఘటనలు చూశాం. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో మాత్రం మద్యానికి బానిసైన వ్యక్తి విచిత్రంగా ప్రవర్తించాడు. డబ్బులు ఇవ్వనందుకు తోటి సోదరుడిపై దాడి చేసి అతని ముక్కును కొరికేశాడు. బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. శ్రీకాంత్ అనే వ్యక్తి ఆల్కహాల్ కొసం డబ్బులివ్వాలని తన సోదరుడిని డిమాండ్ చేశాడు. అతడు తిరస్కరించడంతో కోపానికి గురైన శ్రీకాంత్ మద్యం మత్తులో సోదరుడి ముక్కు కొరికేశాడు. ఈ క్రమంలో తన నివాసంలో తల్లిదండ్రులు, మామపై కూడా దాడి చేశాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు పొలీసులు. బాధితుడు సొబ్రాన్ సంఘటనా ప్రదేశంలోనే కుప్పకూలాడని, తీవ్ర నొప్పితో బాధపడ్డాడని తెలిపిన ఎస్పై జితేంద్రసింగ్.. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates