‘ముక్కోటి’కి రాజన్న ముస్తాబు

ముక్కోటి ఏకాదశికి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముస్తాబైంది. వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఏటా ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగా వైభవంగా నిర్వహిస్తారు. ఆదివారం నుంచి ధనుర్ మాసం ప్రారంభం కానుండడంతో మంగళవారం ఏకాదశి వేడుకలు నిర్వహించనున్నారు. హరిహరులు కొలువైన ఇక్కడ శివ పూజలతో పాటు వైష్ణవ పూజలూ ఉంటాయి. ఈ సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకంతో పాటు లక్ష్మీగణపతి, రాజరాజేశ్వర దేవి, అనంత పద్మనాభస్వామి వారలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించనున్నారు.

ఉత్తర ద్వార దర్శనం..

ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారు ఉత్తర ద్వార దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా రాజరాజేశ్వర స్వామిని అందంగా అలంకరించనున్నారు. ఆలయంలో పల్లకి సేవపై స్వామివారి ప్రదక్షిణల అనంతరం అర్చకులు ఉత్తర ద్వారం ద్వార భక్తులకు దర్శనం కల్పిస్తారు.

రేపటి నుంచి ధనుర్మాసం

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి వేడుకలకు రెండు రోజుల ముందే ధనుర్ మాసం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా అర్చకులు ఈ నెల 16 నుంచి వచ్చే నెల 15 వరకు ప్రతీ రోజూ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

Posted in Uncategorized

Latest Updates