ముఖ కవళికల ద్వారా నేరస్తుల గుర్తింపు : డీజీపీ మహేందర్‌రెడ్డి

తెలంగాణ పోలీసులు ఎప్పటికప్పుడు సాంకేతికతను అన్ని విధాలా ఉపయోగించుకుంటున్నారు. క్రిమినల్ కేసుల్లో నిందితులను గుర్తించేందుకు ఫేసియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చామన్నారు డీజీపీ మహేందర్‌రెడ్డి. ఇది వరకు వేలిముద్రలు, డీఎన్‌ఏ సహకారంతో దర్యాప్తు సాగేదని చెప్పారు. ఫేసియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీతో ముఖ కవళికల ద్వారా నేరస్తులను గుర్తించే అవకాశం ఉందన్నారు డీజీపీ. నేరస్తులు జనంలో కలిసిపోయినా కూడా గుర్తించవచ్చని చెప్పారు. అనుమానితులు, నిందితుల గుర్తింపు కోసమే ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ ఫేసియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని టీఎస్‌కాప్‌కు అనుసంధానం చేసి పోలీసు అధికారులకు అందించామన్నారు మహేందర్‌రెడ్డి. సమాచార నిధి ఏర్పాటు చేసి నేరస్తులను సులభంగా గుర్తించే సౌలభ్యం ఈ టెక్నాలజీతో సాధ్యమవుతుందన్నారు.

Posted in Uncategorized

Latest Updates