ముగిసిన ఉప ఎన్నికల పోలింగ్

bypoవివిధ రాష్ట్రాలలోని 4 లోక్ సభ, 10 అసెంబ్లీ స్ధానాలకు  జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. మహారాష్ట్ర పాల్ గఢ్ లోక్ సభ నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటలకు 40.37 శాతం పోలింగ్ నమోదయింది.  నాగాలాండ్ లోక్ సభ నియోజకవర్గంలో అధికంగా 70 శాతం పోలింగ్ నమోదయింది.  ఇక నకిలీ ఓట్ల ఇష్యూతో వాయిదా పడిన కర్ణాటకలోని ఆర్ ఆర్ నగర్ లో తక్కువగా 50 శాతం పోలింగ్ నమోదయింది. కైరానా ఉప ఎన్నిక పోలింగ్ సమయంలో వీవీ పాట్ మెషీన్లు మోరాయించడంతో ఇబ్బందులు తలెత్తాయి. వీవీ పాట్ మెషీన్లు మాత్రమే ఇబ్బందులు పెట్టాయని, ఈవీఎమ్ లు కాదని షామిల్ జిల్లా మెజిస్ట్రేట్ విక్రమ్ సింగ్ తెలిపారు. పనిచేయని వాటిని రీప్లేస్ చేశామన్నారు. బంఢారా-గొండియా లోక్ సభ కు  జరిగిన ఉపఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎమ్ లలో 25 శాతం మోసపూరితమైనవని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే అన్నీ ఢిఫెక్టివ్ మెషీన్లను రీప్లేస్ చేయడం జరిగిందని ఎలక్షన్ కమీషన్ తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates