ముగిసిన ఎంవీవీఎస్ మూర్తి అంత్యక్రియలు

మాజీ ఎంపీ, శాసనమండలి సభ్యులు, గీతం వర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి అంతిమ సంస్కారాలు ఆదివారం(అక్టోబర్-7) ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో వైజాగ్ లోని గీతం విద్యాసంస్థల సమీపంలో మూర్తి అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ఆయన నివాసం నుంచి గీతం విద్యాసంస్థల వరకూ అంతిమయాత్ర కొనసాగింది. మూర్తి భౌతికకాయంపై విద్యార్థులు పూలు చల్లి నివాళులర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు చిన రాజప్ప, నారా లోకేశ్‌, గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మూర్తి అంత్యక్రియలకు హాజరయ్యారు

Posted in Uncategorized

Latest Updates