ముగిసిన ఎన్ కౌంటర్: కొనసాగుతున్న తనిఖీలు

jammu
జమ్మూ-కశ్మీర్ కరన్ నగర్ లో ఎన్ కౌంటర్ ముగిసింది. సంజువాన్ ఆపరేషన్ జరుగుతున్న టైంలోనే ఇద్దరు టెర్రరిస్టులు కరన్ నగర్ లోని 23వ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ లోకి చొరబడ్డారు. ఈ దాడి తమపనేనని లష్కరే తొయిబా ప్రకటించింది. సోమవారం(ఫిబ్రవరి12) తెల్లవారుజామున ఇద్దరు టెర్రరిస్టులు ఏకే-47 గన్స్ తో పాటు పెద్ద ఎత్తున మారణాయుధాలతో లోపలికి వెళ్లారు. అనుమానితుల కదలికలను గుర్తించిన సెంట్రీ వాళ్లపై కాల్పులు జరిపాడు. తర్వాత ఆ ప్రాంతాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకొని తనిఖీలు చేశారు. ఒక్కో ఇంటిని జల్లెడ పడుతూ ముందుకెళ్లారు. ఓ వైపు ఆర్మీ హెలికాఫ్టర్ తో ఏరియల్ సర్వే చేస్తూ ఎప్పటికప్పుడు బ్యాటిల్ గ్రౌండ్ లోని ఆర్మీ అధికారులకు ఆదేశాలిచ్చారు. మిలిటెంట్లు ఓ నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లో దాక్కున్నారని గుర్తించిన ఆర్మీ ఎదురుకాల్పులు చేసింది. 28 గంటల సుదీర్ఘ ఎన్ కౌంటర్ తర్వాత అందులో దాక్కున్న ఇద్దరు ఉగ్రవాదులను  ఆర్మీ సిబ్బంది మట్టుబెట్టారు. ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు ఉండొచ్చనే అనుమానంతో తనిఖీలు కంటిన్యూ చేస్తున్నారు అధికారులు.

ఈ ఎన్ కౌంటర్ లో ముజాహిద్ అలం అనే జవాన్ వీరమరణం పొందాడు. అతని అంత్యక్రియల్ని శ్రీనగర్ లో నిర్వహించారు. మరో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి

Posted in Uncategorized

Latest Updates