ముగిసిన కేబినెట్ సమావేశం.. పది అంశాలపై ఢిల్లీకి కేసీఆర్

kcrరాష్ట్రమంత్రివర్గ సమావేశం ముగిసింది. ఆదివారం (మే-27) మధ్యాహ్నం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో జరిగిన భేటీలో కొత్త జోన్లు, పంచాయతీ ఎలక్షన్లు, 371డీ ఆర్టికల్ సవరణ, అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వ పథకాలు ఇలా వివిధ అంశాలపై చర్చ జరిగింది. కొత్త జోనల్ విధానం, రైతుల జీవిత బీమా పథకం, కాళేశ్వరానికి అదనపు కేటాయింపులు తదితర అంశాలపై సమావేశంలో కీలకంగా చర్చించారు.

ఉద్యోగ సంఘాలు కూడా జోన్లపై క్లారిటీ ఇవ్వడంతో దీనికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇదే విషయంపై కేంద్రంతో మాట్లాడేందుకు ఈ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. రెండురోజులు అక్కడే ఉండి, ప్రధాని, కేంద్రమంత్రులు, రాష్ట్రపతిని కలిసి 371డీ ఆర్టికల్ సవరణ చేసేలా చర్చలు జరపనున్నారు.

Posted in Uncategorized

Latest Updates