ముగిసిన నీతిఆయోగ్ సమావేశం : జమిలి ఎన్నికలపై ఆలోచించాలని సీఎంలను కోరిన మోడీ

netపర్యావరణ పరిరక్షణ, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సాగిన నీతి ఆయోగ్ పాలకమండలి నాలుగో సమావేశం ముగిసింది. ప్రధాని అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు. జమిలి ఎన్నికల నిర్వహణపై ఆలోచించాలని ముఖ్యమంత్రులను కోరారు ప్రధాని నరేంద్రమోడీ. ఇక.. పేదరిక నిర్మూలను ప్రత్యేకచర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. అభివృద్ది చేయాల్సిన 115 జిల్లాలను నీతి ఆయోగ్ గుర్తించినట్లుగా.. రాష్ట్రాలు కూడా 20 శాతం బ్లాకులను గుర్తించాలన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్.

Posted in Uncategorized

Latest Updates