ముగిసిన మేడారం జాతర హుండీల నోట్ల లెక్కింపు

medaramhundiఈ సంవత్సరం జరిగిన మేడారం సమ్మక్క సారలమ్మలకు భక్తులు భారీ కానుకలు సమర్పించారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో వన దేవతలకు భక్తులు హుండీల్లో సమర్పించిన నగదు నోట్ల లెక్కింపు ప్రక్రియ శనివారం (ఫిబ్రవరి-10)తో ముగిసింది. మొత్తం 479 హుండీల్లో భక్తులు వేసిన నగదు తొమ్మిది కోట్ల అరవై ఒక లక్షల నలబైతొమ్మిది వేల నూటతొంబై ఐదు రూపాయలు ( 9,61,49,195)గా తేలింది. ఇనుము, వస్త్రం, ఒడి బియ్యం హుండీల్లో ఉన్న మొత్తం నగదును లెక్కించారు. మిగిలిన కాయిన్స్, బంగారం, వెండి, విదేశీ కరెన్సీని లెక్కిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates