ముగిసిన రేవంత్ రెడ్డి విచారణ.. 23వ తేదీన మరోసారి

హైదరాబాద్ : బషీర్ బాగ్ లోని ఆయకార్ భవన్ లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సన్నిహితుడు ఉదయ్ సింహల విచారణ పూర్తయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘంగా రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు ఇన్ కం టాక్స్ అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు అధికారులు.

విచారణ పూర్తయ్యాక రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు నా దగ్గర ఉన్న సమాధానాలు చెప్పాను. ఈ నెల 23 న మరో సారి ఐటీ కార్యాలయానికి హాజరు కావాలని చెప్పారు. సంతృప్తి కర సమాధానాలు చెప్పాను. బినామీలపై ఆరా తీశారు. ఆ సంస్థలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ కంపెనీల ఆధారాలు ఉంటే మీరే చూపించండి. ఐటీ, ఈడీ విచారణ ముసుగులో కేసీఆర్ ప్రైవేటు సైన్యం విచారణ చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమపై కక్ష్య పూర్వకంగానే సోదాలు చేస్తున్నాయి” అని చెప్పారు.

 

Posted in Uncategorized

Latest Updates