ముగిసిన CWC మీటింగ్ : పొత్తుల అధికారం రాహుల్ దే

ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది. రాహుల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాబోయే ఎన్నికలపై నేతలు చర్చించారు. 2019 ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు రాహుల్. 2019 ఎలక్షన్స్ లో ఏఏ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాలో రాహుల్ గాంధీకి అధికారం కల్పిస్తూ చేసిన తీర్మానాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో పొత్తుల కోసం కొంతమంది పార్టీ నేతలతో ఓ గ్రూప్ ని ఏర్పాటు చేస్తామని, పొత్తుల వ్యవహారం ఆ గ్రూప్ చూసుకుంటుందని సమావేశం తర్వాత రాహుల్ తెలిపారు.వచ్చే ఎన్నికలకు ఆర్నెళ్లు ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని కోరామన్నారు రాష్ట్ర నేతలు. ముందుగానే మ్యానిఫెస్ట్ విడుదల చేస్తే బాగుంటుందని తాను సమావేశంలో సూచించినట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.


Posted in Uncategorized

Latest Updates