ముగిసిన RRR ఫస్ట్ షెడ్యూల్.. ఓటేయాలని రాజమౌళి పిలుపు

ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు RRR ఫస్ట్ షెడ్యూల్ అప్పుడే పూర్తయింది. రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసిన రాజమౌళి అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ కు ప్యాకప్ చెప్పేశారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఫస్ట్ షెడ్యూల్ డన్ అంటూ రాజమౌళి, డీఓపీ సెంథిల్ ఇతర టీమ్ మెంబర్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

ఫస్ట్ షెడ్యూల్ ముగిసిందని చెప్పిన రాజమౌళి… ఓటేసే టైమ్ వచ్చిందని అన్నాడు. మీ ఓటు మీరు వేయడానికి సిద్ధంగా ఉన్నారా అని ట్విట్టర్ లో కామెంట్ పెట్టారు రాజమౌళి. దీనిని నెటిజన్ల నుంచి స్పందన బాగా కనిపిస్తోంది. “ప్రియమైన తెలంగాణ ప్రజలారా.. మన భవిష్యత్తును నిర్మిస్తున్నందుకు గర్వపడండి. రేపు ఓటు వేయండి” అంటూ ఓ మెసేజ్ కూడా ఇచ్చారు రాజమౌళి.

Posted in Uncategorized

Latest Updates