ముగ్గురు అమ్మాయిలపై యాసిడ్ దాడి

ACIDముగ్గురు అమ్మాయిలపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ దారుణ సంఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగింది. ముగ్గురు అమ్మాయిల్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు కాగా…మరొకరు వారి స్నేహితురాలు. యాసిడ్ దాడిలో ముగ్గురి ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. యాసిడ్ దాడి చేసింది ఇద్దరు అక్కాచెల్లెళ్ల మేనమామే.

ఆ వ్యక్తి తనను పెళ్లి చేసుకోవాలని అక్కాచెల్లెల్లిద్దరిలో ఒకరికి ప్రపోజల్ పెట్టాడు. అయితే అతన్ని పెళ్లి చేసుకునేందుకు ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. ఇద్దరమ్మాయిలు తమ స్నేహితురాలితో కలిసి గజ్‌రాత్‌లోని డంగ్ జిల్లాలో ఓ బస్‌స్టాప్ వద్ద బస్ కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో అమ్మాయిల మేనమామ (నిందితుడు), మరో వ్యక్తి కలిసి బైకుపై వచ్చి అక్కడున్న ముగ్గురిపై యాసిడ్ తో దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు తెలిపారు డంగ్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో అమీర్ అబ్బాస్.

Posted in Uncategorized

Latest Updates