ముచ్చటగా మూడోసారి : సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం

dawaబౌలింగ్ నే నమ్ముకున్న హైదరాబాద్ అదే స్ట్రాటజీతో వరుసగా మూడో మ్యాచ్ గెలిచింది. కోల్ కతా నైట్ రైడర్స్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బౌలింగ్ లో సత్తా చాటిన సన్ రైజర్స్.. తర్వాత ఈజీ టార్గెట్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. మరో ఓవర్ మిగిలి ఉండగానే 139 రన్స్ టార్గెట్ ని ఫినిష్ చేసింది హైదరాబాద్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్ కతా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 138 రన్స్ మాత్రమే చేయగలిగింది. క్రిస్ లిన్ 49, కార్తీక్ 29, నితీష్ రాణా 18 రన్స్ చేశారు. భువనేశ్వర్ 3 వికెట్లు, స్టాన్ లేక్-షకిబుల్ హసన్ తలో రెండు వికెట్లు తీశారు. 139 రన్స్ ఈజీ టార్గెట్ తో బరిలో దిగిన హైదరాబాద్… మరో ఓవర్ మిగిలుండగా.. 5 వికెట్లు కోల్పోయి చేధించింది.

Posted in Uncategorized

Latest Updates