ముఠా మళ్లీ దిగిందా : రెండు రోజుల్లో 4 చైన్ స్నాచింగ్స్

dc-Cover-bsnudco08r3igtj44duecnr7m4-20170829064312.Mediసిటీ ఔట్ స్కట్స్ లో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. అడ్రస్ అడిగో… అటకాయించో… గొలుసులు తెంచుకుపోతున్నారు. ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు… జూలు విదిలిస్తున్నారు. ఆదివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్… తుర్క్ యాంజాల్ లో ఓ మహిళ మెడలో 3 తులాల పుస్తెల తాడును ఎత్తుకెళ్లారు దుండగులు. అడ్రస్ అడుగుతున్నట్టు యాక్ట్ చేసి.. దగ్గరగా వెళ్లాక చైన్ తెంచుకుపోయారు దుండగులు. సీసీ కెమెరాలో ఈ విజువల్ క్లియర్ గా రికార్డైంది. రెండు రోజుల వ్యవధిలో సిటీలో చోటు చేసుకున్న నాలుగో ఘటన ఇది. శివారు ప్రాంతాల్లో పోలీసుల నిఘా పెద్దగా లేకపోవడం… సీసీ కెమెరాల ఏర్పాటుతో సమస్య తీరుతుందన్నట్టు పోలీసులు ప్రవర్తించడంపై విమర్శలు వస్తున్నాయి. పాత నేరస్థుల కదలికలపై నిఘా లేకపోవడం.. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసుల మధ్య సమన్వయ లోపంతోనే చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జైలుకు వెళ్లొచ్చిన నేరస్తులు పదే పదే చైన్ స్నాచింగ్స్ కు పాల్పడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Posted in Uncategorized

Latest Updates