ముదురుతున్న వివాదం.. ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్

Amanatullah-Khan-Copyఢిల్లీలో ప్రభుత్వానికి అధికారులకు మధ్య పెద్ద యుద్దమే నడుస్తోంది. అప్పట్లో గవర్నర్ నజీబ్ జంగ్‌తో కేజ్రీవాల్ వివాదాన్ని తలపించేలా మరో వివాదం తెరపైకి వచ్చింది. ఢిల్లీ సీఎస్ పై దాడి కేసులో జామియా నగర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్.
సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు తనపై దాడి చేశారని మంగళవారం ఫిబ్రవరి-20 రాత్రి సీఎస్ అన్షు ప్రకాశ్ చెప్పారు.  లెఫ్టినెంట్ గవర్నర్ కు కంప్లైంట్ చేశారు. ఈ కేసులో ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్ ను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేయగా… బుధవారం (ఫిబ్రవరి-21)  మరో ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ లొంగిపోయారు. అయితే.. తనే తప్పు చేయలేదన్నారు ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్.

Posted in Uncategorized

Latest Updates