మున్సిపాలిటీల్లోనూ రూ.5 భోజ‌న క్యాంటీన్లు

హైదరాబాద్‌ లో GHMC పరిధిలో అమలు చేస్తున్న రూ.5 భోజనానికి  రోజు రోజుకీ మంచి స్పందన వస్తోంది. క్వాలిటీ ఫుడ్ అందిస్తుండటంతో మధ్య తరగతి ప్రజలు కూడా ఈ భోజనంపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌లో ఈ సౌక‌ర్యం క‌ల్పించాల‌ని  మున్సిపాలిటీ శాఖ నిర్ణ‌యించింది. హరేకృష్ణ మూవ్‌మెంట్‌ ఛారిటబుల్‌ ఫౌండేషన్ ఆస‌క్తి చూప‌డంతో 118 క్యాంటీన్ల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ  కమిషనర్లను ఆదేశిస్తూ ఆ శాఖ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 50 వేల జనాభాకు ఒక సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు. కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్  పలు ప‌ట్ణణాల్లో వంట కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

 

 

Posted in Uncategorized

Latest Updates