మున్సిపాలిటీ శాఖలో ఉద్యోగాలకు TSPSC నోటిఫికేషన్

మున్సిపాలిటీ శాఖలో పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి TSPSC నోటిఫికేషన్ జారీచేసింది. 35 శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, 50 హెల్త్ అసిస్టెంట్ల భర్తీకి… అదేవిధంగా పాడి అభివృద్ధి సహకార సమాఖ్యలో 8 ఫీల్డ్ అసిస్టెంట్ల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రకటించింది TSPSC. శానిటరీ ఇన్‌స్పెక్టర్ల పోస్టులకు ఈ నెల 31 నుంచి ఆగస్టు 30 వరకు దరఖాస్తులు స్వీకరణ ఉంటుంది. హెల్త్, ఫీల్డ్ అసిస్టెంట్ల పోస్టులకు ఆగస్టు 3 నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. మొత్తంగా 93 ఉద్యోగాల భర్తీకి TSPSC ప్రకటన జారీ చేసింది.

Posted in Uncategorized

Latest Updates