ముప్పు ఎవరి నుంచి : తుపాకీ లైసెన్స్ కోరిన ధోనీ భార్య

sakshi
భారత్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని భార్య సాక్షి డిమాండ్ కలకలం రేపుతోంది. గన్ లైసెన్స్‌ ఇప్పించాలని పోలీస్ శాఖను కోరింది. తనకు ప్రాణ హాని ఉందని కూడా వెల్లడించింది. ఎంఎస్‌ ధోని మ్యాచ్‌ల దృష్ట్యా బీజీగా ఉంటాడని.. ధోని ఇంట్లో చాలా తక్కువ సమయం ఉంటాడని తెలిపింది. కూతురితో కలిసి ఒంటరిగానే ఇంట్లో ఉంటున్నట్లు వెల్లడించింది. ఏదో ఒక పనిపై బయటకు వెళ్తుంటామని.. ఆ సమయంలో ఒంటరిగానే వెళ్లాల్సి వస్తుందన్నారు తెలిపింది ధోనీ భార్య సాక్షి. నా భద్రతా దృష్ట్యా త్వరగా లైసెన్స్‌డ్‌ పిస్టల్‌ లేదా 0.32 రివాల్వర్‌ ఇప్పించండి అని కోరారు సాక్షి.

ధోనీ భార్య సాక్షి.. గన్ లైసెన్స్ కోరటం సంచలనం అయ్యింది. హైప్రొఫైల్ ఫ్యామిలీ, ఎంతో భద్రత మధ్య ఉండే ఈ కుటుంబానికి నిత్యం ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఉంది. అయితే పోలీస్ శాఖకు రాసిన లేఖలో సాక్షి వెలిబుచ్చిన భయం ఆసక్తిగా మారింది. తనకు ప్రాణహాని ఉందని.. ముప్పు పొంచి ఉందని చెప్పటం కలకలం రేపుతోంది. ఎవరి నుంచి ముప్పు ఉంది.. ఏమైనా బెదిరింపులు వచ్చాయా.. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు ధోనీ భార్య తుపాకీ లైసెన్స్ కోరటం ఏంటని చర్చ కూడా మొదలైపోయింది..

Posted in Uncategorized

Latest Updates