ముర్మూర్ లో ఎత్తిపోతలకు సీఎం శంకుస్థాపన

KCR Dపెద్దపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. కరీంనగర్ లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి పెద్దపల్లి జిల్లాకు వెళ్లారు సీఎం. మంగళవారం (ఫిబ్రవరి-27) అంతర్గాం మండలం ముర్ముర్ దగ్గర ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ప్రారంభించి అక్కడ బహిరంగసభలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ తోపాటు…. మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు,  ప్రభుత్వ సలహాదారు జి.వివేక్ వెంకటస్వామి పర్యటనలో పాల్గొంటున్నారు.

ఈ మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని చనాక-కొరాట బ్యారేజీ దగ్గరకు చేరుకుంటారు సీఎం. పనులను పరిశీలించిన తర్వాత అక్కడి నుంచి 12 గంటల 10 నిమిషాలకు ఆదిలాబాద్ డైట్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు.

తర్వాత.. మూడు గంటలకు మంచిర్యాల చేరుకొని భూగర్భ గనులకు శంకుస్థాపన చేస్తారు కేసీఆర్. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 వరకు శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలో ముఖ్యమంత్రి  పర్యటిస్తారు. నస్పూర్ లో జిల్లా కలెక్టరేట్ భవనానికి శంకుస్థాపన చేస్తారు. కార్మిక వాడల్లోకి వెళ్ళి  కార్మిక కుటుంబాలతో ముఖాముఖి మాట్లాడతారు. సీసీసీ గెస్ట్ హౌస్ లో కార్మికులు, TBGKS నాయకులతో సమావేశం అవుతారు. ప్రగతి స్టేడియం నుంచే అయిదు కొత్త గనులను ప్రారంభించి… కార్మికులనుద్దేశించి బహిరంగసభ లో ప్రసంగిస్తారు. 5.00 గంటల తర్వాత.. తిరిగి హైదరాబాద్ వెళ్తారు ముఖ్యమంత్రి కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates