ముస్లింలకు సీఎం కేసీఆర్ బంధువు: ఓవైసీ

owaisiసీఎం కేసీఆర్ ముస్లింలకీ బంధువన్నారు MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. అందుకే TRSతో స్నేహంగా ఉంటున్నామన్నారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరుగుతున్న చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.

మైనార్టీ సంక్షేమం కోసం భారీగా నిధులు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. కేటాయించిన నిధులన్నింటినీ ఖర్చు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాతబస్తీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎండకాలం మొదలైందని.. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఓవైసీ సూచించారు. పాతబస్తీలోని పలు ప్రాంతాలకు కృష్ణా నీళ్లు తీసుకురావాలన్నారు. అంతే కాకుండా వేసవి దృష్ట్యా రాష్ట్రంలో మంచి నీటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఓవైసీ.

Posted in Uncategorized

Latest Updates