ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్

KCR ALLAముస్లింల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. శుక్రవారం (జూన్-8) హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు దావత్ ఎ ఇఫ్తార్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రులు నాయిని, హరీష్, తలసాని, MIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, సీఎస్, మైనార్టీశాఖ అధికారులు అటెండయ్యారు.

అల్లా దయతో తెలంగాణ వచ్చిందన్న సీఎం… అభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ గా ఉందన్నారు. అన్ని రాష్ట్రాల్లో మైనార్టీ సంక్షేమానికి 4 వేల కోట్లు కేటాయిస్తే… ఒక్క తెలంగాణ ప్రభుత్వమే 2 వేల కోట్లు ఇచ్చిందన్నారు. అజ్మీర్ దర్గా దగ్గర రాజస్థాన్ కేటాయించిన ఎకరం స్థలంలో యాత్రికుల కోసం 5 కోట్లతో భవన్ నిర్మిస్తామన్నారు. అంతకు ముందు ముస్లింలకు దుస్తులు పంపిణీ చేశారు సీఎం. సభా వేదికపై ఉర్దూలో కవిత చదివి వినిపించారు .తర్వాత మంత్రులు, ముస్లిం మత పెద్దలతో కలిసి ఇఫ్లార్ విందులో పాల్గొన్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రమంతటా 8 వందల మసీదుల్లో దాదాపు 4లక్షల మందికి ఇఫ్తార్ దావత్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ లోనే 4 వందల మసీదుల్లో ఇఫ్తార్ విందు ఇవ్వనుంది.

 

Posted in Uncategorized

Latest Updates