ముస్లిం యువకుడితో ఫ్రెండ్ షిప్…యువతిపై పోలీసుల దాడి

యూపీ : గుంపుదాడి నుంచి యువతిని రక్షించిన పోలీసులే….యువతిపై దాడికి పాల్పడ్డారు. ముల్లా అనే ముస్లిం యువకుడితో ఫ్రెండ్ షిప్ చేస్తోందన్న కారణంతో యువతిపై దాడి చేశారు పోలీసులు. “ముల్లా అంత నచ్చాడా” అంటూ మహిళను కొట్టారు పోలీసులు. యూపీలోని మీరట్ లో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటనకు భాధ్యులైన ముగ్గురు పోలీసులు.. ఓ మహిళా కానిస్టేబుల్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

ఆదివారం(సెప్టెంబర్-23) ముస్లిం యువకుడు ముల్లా ఇంట్లోకి చొరబడ్డారు కొంత మంది వీహెచ్ పీ కార్యకర్తలు.  తన క్లాస్ మేట్ అయిన ఓ యువతితో కలిసి చదువుకొంటున్న  ముల్లాపై దాడి చేశారు. లవ్ జిహాద్ నశించాలి అంటూ యువతీ, యువకుడిపై దాడికి పాల్పడ్డారు. ఆ తరువాత వీరిద్దరినీ పోలీసులకి అప్పగించారు.
పోలీసుల వాహనంలో ఎక్కించిన తర్వాత యువతిపై… మహిళా కానిస్టేబుల్ దాడికి పాల్పడింది. వాహనంలోని ఫ్రంట్ సీటులో ఇద్దరు పోలీసులు కూర్చొని ఉండగా, వెనుక సీటులో ఓ మహిళా పోలీస్, మరో పోలీసు మధ్య యువతి కూర్చొని ఉంది. ఈ సమయంలో ముందు సీట్లో కూర్చొన్న పోలీసులు యువతిని….ఇంతమంది హిందువులు ఉండగా… నీకు ముల్లానే దొరికాడా అంటూ తిడుతుండగా…. వెనక సీట్లో యువతి పక్కన కూర్చొని ఉన్న మహిళా పోలీస్.. యువతిపై పలుమార్లు చేయి చేసుకొంది.

కారులో వీడియో తీసిన ఓ పోలీస్ .. 29 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో క్లిప్ ను తన ఫ్రెండ్ కి షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు…..ఈ ఘటనకు భాధ్యులైన నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. విచారణకు ఆదేశించామని, రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates