ముస్లిం యువకుడితో ఫ్రెండ్ షిప్ : రేప్ కేసు పెట్టాలని యువతిని వేధించిన పోలీసులు

ముస్లిం యువకుడితో ఫ్రెండ్ షిప్ చేస్తోందన్న కారణంతో ఓ యువతిపై పోలీసులు దాడి చేశారు. ఫ్రెండ్ షిప్ చేయడానికి ముస్లిం వ్యక్తే దొరికాడా నీకు అంటూ పోలీస్ వాహనంలో యువతిపై దాడి చేశారు. యూపీలోని మీరట్‌ లో జరిగిన ఈ ఘటనలో ఇప్పుడు కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. తన స్నేహితుడిపై అత్యాచారం కేసు పెడితే తనను వదిలేస్తానని పోలీసులు వేధించారని బాధిత యువతి తెలిపింది.
పోలీస్ వ్యానులో తన పక్కన కూర్చున్న మహిళా కానిస్టేబుల్ తనపై దాడిచేసిందని, తనను తీసుకొచ్చి స్టేషన్‌ లో ఉంచారని భాధిత యువతి తెలిపింది. ఈ సమయంలో తన స్నేహితుడిపై అత్యాచారం కేసు పెట్టమని పోలీసులు బలవంతం చేశారని, అలా కేసు పెడితే తనను వదిలేస్తామని చెప్పారని యువతి తెలిపింది. తన తల్లిదండ్రులతో కూడా పోలీసులు ఇదే మాట చెప్పారని తెలిపింది. పోలీసులు తీరుతో స్నేహితులను కలవాలంటేనే భయం వేస్తోందని యువతి తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates