ముహూర్తం ఫిక్స్ : డియర్ కామ్రేడ్ గా విజయ్

VIJAYఅర్జున్ రెడ్డితో పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ, మహానటితో మంచి గుర్తింపు పొంది జెట్ స్పోడుతో దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం ఆయన టాక్సివాలా త్వరలోనే రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వరుసపెట్టి సినిమాలను నైన్లో పెడుతూ ఫుల్ జోష్ మీదున్నాడు.  భరత్ కమ్మ అనే కొత్త డైరెక్టర్ తో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు విజయ్ దేవరకొండ.

మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి డియ‌ర్ కామ్రేడ్ అనే టైటిల్ ఫిక్స్ చేయ‌గా, ఇందులో కాకినాడ యాస‌లో మాట్లాడి అల‌రించ‌నున్నాడట విజ‌య్‌. హీరోయిన్ గా కొత్త అమ్మాయిని తీసుకోనున్న ఈ మూవీ.. సోమవారం (జూలై-2) ఉద‌యం 10గం.ల‌కి గ్రాండ్‌గా లాంచ్ కానుంది. ఈ మేర‌కు పోస్టర్‌ ని విడుద‌ల చేసి విష‌యాన్ని అఫీషియల్ గా తెలిపారు మేకర్స్.  ఈస్ట్‌, వెస్ట్ గోదావ‌రి జిల్లాల‌కి సంబంధించిన టాలెంట్ వ్య‌క్తుల‌ని మాత్ర‌మే డియ‌ర్ కామ్రేడ్ సినిమా కోసం ఎంపిక చేయ‌నున్నట్టు నిర్మాత‌లు ప్ర‌క‌టించగా, ఇటీవ‌ల కాకినాడ‌లో ఆడిషన్స్ నిర్వ‌హించినట్లు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates