మూగ జీవాలకు గడ్డి దాత : పశువుల కోసం150 ఎకరాలు వదిలేసిన రైతు

GADDIపది గజలా చోటున్నా… చదును చేసి ఉపయోగంలోకి తెచ్చుకునే రోజుల్లో…తనకున్న 150 ఎకరాలను పశువుల కోసం వదిలేశాడో వ్యక్తి. పదిహేను పదుల ఎకరాల పంట పొలాలను ఊళ్లో ఉన్న పశువుల కడపు నింపేందుకు వినియోగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. మూగజీవాలకు గడ్డి దాతగా… ప్రకృతి ప్రేమికుడిగా పలువరి ప్రశంసలందుకుంటున్నాడు. ఖమ్మం జిల్లాలో పాడి రైతులకు వెన్నుముకగా నిలుస్తున్న రైతుబంధుపై స్పెషల్ స్టోరీ.  ఖమ్మం రూరల్ మండలానికి చెందిన వ్యాపారి అయిన సాధిఖ్…  ఖమ్మం నగరానికి 15 కిలో మీటర్ల దూరంలో మెట్ట భూములు కొన్నాడు.

ఏడాదికి రెండు పంటలు పండించే అవకాశం ఉండడం, నగరం విస్తరించడంతో ప్రస్తుతం ఈ భూములకు విలువ పెరిగింది. అయితే నగరం విస్తరించడంతో  పశువులకు మేత కరువవ్వడంతో…. మూగజీవాలను కబేళాలకు తరలిస్తున్నారు రైతులు. ఇది గమనించిన సాధిఖ్….తనకున్న భూమిలో గడ్డివిత్తనాలు వేసి జీవాల మేతకు వదిలేశాడు. ఖమ్మం మండలంలోని కాచిరాజు గూడెం, వెంయటాయపాలెం, గూడురుపాడు, కస్నాతండ, గూడురవారిగూడెం గ్రామాలకు చెందిన పశువులను మేత కోసం అలీ పొలానికి తీసుకొస్తున్నారు రైతులు. బయటి మార్కెట్లో పచ్చగడ్డి ఒకకట్ట 150 రూపాయల వరకు ఉందని…దీంతో పశుపోషణ భారంగా మారిందంటున్నారు. దీనికి తోడు రియల్ బూమ్ పెరగడంతో…పశువులకు మేత కరువైందని వాపోతున్నారు. తన భూమిని అడవిగా మార్చి పశువులకు గడ్డిని దానంగా ఇస్తున్న సాధిక్ అలీని అభినందిస్తున్నారు.

గ్రామస్థులమైనా తాము కూడా డైరీ పాలు తాగక తప్పడం లేదంటున్నారు రైతులు. పశుపోషణ లేక పాలు కల్తీ అవుతున్నాయని చెబుతున్నారు. అలీ పొలంలో పశువులకు మేతతో పాటు నీళ్లు తాగేందుకు బావిని కూడా తవ్వించారని, ఆయుర్వేదం కోసం అనేక వనమూలికల మొక్కలను కూడా పెంచుతున్నారని చెబుతున్నారు అన్నదాతలు. రైతు లేకుంటే తిండి గింజలకు కూడా కరువొస్తుందంటాడు సాధిఖ్. పాలిచ్చే పశువులను ఎలాగైనా కాపాడాలని ఈ  నిర్ణయం తీసుకున్నానని చెబుతున్నాడు. తన పొలంలో చుట్టుపక్కల ఉన్న దాదాపు ఐదు గ్రామాల పశువులకు మేత దొరకండం సంతోషంగా ఉందంటున్నారు. సాధిక్ చేస్తున్న సేవను చూసి ప్రశంసిస్తున్నారు స్థానికులు. ప్రకృతిని ఎంతలా ప్రేమిస్తే…పచ్చదనం అన్ని కాలాల పాటు చల్లగా ఉంటుందంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates