మూడు నదుల నీళ్లు అందుతున్న నగరం హైదరాబాదే : హరీష్

మూడు నదుల నీళ్లు అందుతున్న నగరం హైదరాబాదేనన్నారు మార్కెటింగ్ శాఖమంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టును హైదరాబాద్ కు కూడా లింకు చేస్తామన్నారు. సిటీలో పేకాట క్లబ్బులను మూసివేయించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. శుక్రవారం (ఆగస్టు-3) కూకట్ పల్లిలో మోడల్ రైతు మార్కెట్ భవనానికి శంకుస్థాపన చేశారు హరీష్. పదికోట్ల రూపాయలతో కడుతున్న మోడల్ రైతు మార్కెట్ ను ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్ నేతలు పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారన్నారు హరీష్.

Posted in Uncategorized

Latest Updates