మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు జరపాలి.. హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పంచాయతీల్లో స్పెషల్ అధికారుల నియామకాన్ని సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. గడువు ముగిసిన పంచాయతీలకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులను నియమించిందనీ… ఇది చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు. పిటిషన్లు అన్నింటినీ కలిపి విచారించిన న్యాయస్థానం… వారి వాదనతో ఏకీభవించింది.

మూడు నెలల్లో అన్ని పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది. ఎలక్షన్ కమిషన్ కు కూడా ఆదేశాలు ఇచ్చింది. మూడు నెలల వరకు స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుందని.. ఎన్నికల ప్రక్రియలో వారిని భాగం చేయాలని సూచించింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిర్వహించాలని.. వాయిదాలు సరైన పద్ధతి కాదని కోర్టు వ్యాఖ్యానించింది.

 

Posted in Uncategorized

Latest Updates