మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యం : తెలంగాణలో ఘోర పరాజయం

హైదరాబాద్‌: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో దూసుకెళుతుంది కాంగ్రెస్. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో ఆ పార్టీ ముందంజలో ఉంది. మిజోరం, తెలంగాణలో ఆ పార్టీ వెనుకంజలో ఉంది. మధ్యప్రదేశ్‌(230)లో 114 స్థానాల్లో కాంగ్రెస్‌, 101 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. రాజస్థాన్‌(199)లో 102 స్థానాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉండగా, 76 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఛత్తీస్‌గఢ్(90)‌లో 58 స్థానాల్లో కాంగ్రెస్‌, 23 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నాయి.

ఇక తెలంగాణలో ఆ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. టీఆర్ ఎస్ 91 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 15 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. మిజోరం(40)లోనూ కాంగ్రెస్‌ పార్టీ వెనుకంజలో ఉంది. ఇక్కడ ఎంఎన్‌ఎఫ్‌ 25 స్థానాల్లో ఆధిక్యం ఉండగా కాంగ్రెస్‌ 8 స్థానల్లోనే ఆధిక్యంలో ఉంది.

Posted in Uncategorized

Latest Updates