మూడు రోజులుగా గవర్నర్ ఇంట్లోనే పడక : వెనక్కి తగ్గని కేజ్రీవాల్

KEGRIVALగత మూడు రోజులుగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో మెరుపు ధర్నాకు దిగి, అక్కడే నిద్రపోతున్నాడు సీఎం కేజ్రీవాల్. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సీనియర్ మంత్రులు సత్యేందర్ జైన్, గోపాల్ రాయ్ సైతం అక్కడే పడుకుంటున్నారు. ‘‘మా డిమాండ్లకు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ స్పందించే వరకు మేము ఇక్కడి నుంచి వెళ్లబోం..’’ అని స్పష్టం చేశారు సీఎం కేజ్రీవాల్.

ఢిల్లీలోని రాజ్ నివాస్ వెయిటింగ్ రూమ్‌లో గత మూడు రాత్రులుగా వీరంతా అక్కడే నిద్రపోయారు. వీరిలో సత్యేందర్ జైన్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ బైజల్‌కు వ్యతిరేకంగా స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారి ఈ తరహా ఆందోళనకు దిగారు సీఎం కేజ్రీవాల్. ఇప్పట్లో ఆయన వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు.

Posted in Uncategorized

Latest Updates