మూడేళ్లలో నక్సలిజం అంతం : రాజ్ నాథ్

మూడేళ్లలో భారత్ లో నక్సలిజం అంతమవుతుందన్నారు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్. ర్యాపిడ్‌‌ యాక్షన్‌ ఫోర్స్ 26వ వార్షిక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదివారం(అక్టోబర్-7) రాజ్ నాథ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజ్ నాథ్ మాట్లాడుతూ…గతంలో పోలిస్తే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల సంఖ్య ఇప్పుడు తగ్గిందని అన్నారు. రాబోయో మూడేళ్లలో నక్సలిజం భారత్ లో కనుమరుగైపోనుందని అన్నారు. సీఆర్‌పీఎఫ్‌ బలగాల నిబద్ధత, సమర్థవంతమైన పని, పలు రాష్ట్రాల పోలీసుల కృషి వల్లే ఇది సాధ్యమవుతోందన్నారు. ఈ ఏడాది దేశంలో మొత్తం 131 మంది మావోయిస్టులు, ఉగ్రవాదులను బలగాలు అంతమొందించడమే కాకుండా 1,287 మందిని అరెస్టు చేశాయన్నారు. మరో 58 మంది పోలీసులకు లొంగిపోయారని తెలిపారు. అని ఆయన వివరించారు. ర్యాపిడ్‌ యాక్షన్‌ బలగాల సంఖ్యతో పాటు వారి దగ్గర ఉండే ఆయుధాల సంఖ్యను ఇటీవల మరింత పెంచినట్లు తెలిపారు.
జమ్మూకశ్మీర్‌లోనూ సీఆర్‌పీఎఫ్‌ ఉత్తమ సేవలు అందిస్తుందని రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రశంసించారు. ఆందోళనకారులు పెద్ద ఎత్తున పోగైన సమయంలో వారితో ఎలా వ్యవహరించాలో భద్రతా బలగాలకు తెలుసు. అలాగే, తమ బలగాలను ఎప్పుడు వారిపై ప్రయోగించాలో కూడా తెలుసునని రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.

Posted in Uncategorized

Latest Updates