మూడో అవార్డు మాది కాదు

BHAHUBALIతెలుగు ఇండస్ట్రీలోనే సంచలనం సృష్టించి…భారీగా కలెక్షన్లను కొల్లగొట్టిన బాహుబలి 2 మూవీ అవార్డుల విషయంలోనూ సత్తా చాటింది. ఏకంగా మూడు నేషనల్ అవార్డులను సొంతం చేసుకున్నట్లు జ్యూరీ చీఫ్ శేఖర్ కపూర్ ప్రకటించారు. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ పాపులర్ ఫిల్మ్, బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ కేటగిరీల్లో బాహుబలి 2కి అవార్డులు వచ్చాయి. అయితే ఇక్కడే ఓ పొరపాటు జరిగింది. ఆ మూడో అవార్డు కోసం ప్రకటించిన వ్యక్తి తమతో పనిచేయలేదంటూ బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు. బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ కింద అబ్బాస్ అలీ మొఘుల్ అనే వ్యక్తి పేరును ప్రకటిస్తూ బాహుబలి 2 మూవీకి అతను పనిచేసినట్లు చెప్పారు. అయితే ఆ వ్యక్తి ఎవరో తెలియదని…తమతో పనిచేయలేదన్నారు. నిజానికి బాహుబలి రెండు పార్ట్‌లకు యాక్షన్ డైరెక్టర్‌గా పీటర్ హెయిన్ పనిచేశాడు. దీంతో ప్రస్తుతం బాహుబలి 2కి స్పెషల్ ఎఫెక్ట్స్, పాపులర్ ఫిల్మ్ కేటగిరీల్లో మాత్రమే అవార్డులు వచ్చాయి.

Posted in Uncategorized

Latest Updates