మూడో రోజూ ఆగని వానలు.. సిటీలో భారీ వర్షం

హైదరాబాద్: వరుసగా మూడో రోజు వానలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్‌‌తోపాటు పరిసర ప్రాంతాల్లో శనివారం కూడా వర్షం కురిసింది. కొన్ని ఏరియాల్లో సాధారణ వర్షపాతం నమోదవ్వగా.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చర్లపల్లిలో 5.7 సెంటీమీటర్లు, కల్వంచలో 4.2, తట్టి అన్నారం, తొర్రూర్‌‌లో 3.5, ఎల్‌‌బీ నగర్‌‌లో 3.2, మౌలాలి, ఏఎస్ రావు నగర్, సరూర్ నగర్‌‌లో 3, వనస్థలిపురం, హయత్ నగర్‌‌లో 2.5, మలక్‌ పేట్‌‌లో 2.4, పీర్జాదిగూడ, దమ్మాయిగూడ, హస్తినాపురంలో 2.3, నాగోల్‌‌లో 2.2, మల్కాజ్ గిరిలో 2.1, పెద్ద అంబర్‌‌పేట్‌‌లో 2, అసిఫ్ నగర్, రామంతపూర్‌‌లో 1.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Latest Updates