మూడో విడత చేప పిల్లల పంపిణీకి ముహుర్తం ఫిక్స్

మూడో  విడత  చేప పిల్లల  పంపిణీకి  సిద్దమైంది  సర్కార్.  ఈ నెల  31న …భూపాల పల్లి  నియోజకవర్గంలో  ఈ కార్యాక్రమాన్ని  ప్రారంభించనున్నారు   మత్య్సశాఖ  మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్.  ఈ ఏడాది… 75  కోట్ల  80 వేల  చేప  పిల్లలను … 21 వేల 568 చెరువులు , రిజర్వాయర్లలో వదిలిపెట్టాలని  నిర్ణయించారు.  4 కోట్ల  రోయ్య  పిల్లలను  కూడా పంపిణీ  చేయనున్నట్లు  తెలిపారు మంత్రి.

మూడో విడత చేప పిల్లల పంపిణీకి ముహుర్తం ఖరారు చేసింది సర్కార్. ఈ నెల 31 నుంచి ప్రారంభించనుంది. శాసనసభ స్పీకర్ మధుసూదనా చారి ప్రాతినిధ్యం వహిస్తున్న భూపాలపల్లి నియోజకవర్గంలోని ఘన్ పూర్ చెరువులో చేపపిల్లల పంపిణీని మంత్రి తలసాని మొదలు పెట్టనున్నారు. దీనికి సంబంధించి సెక్రటేరియట్ లో మత్స్య శాఖ అధికారులతో సమీక్ష చేశారు మంత్రి. ఆ తర్వాత టూరిజం శాఖ మంత్రి చందూలాల్  ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గ పరిధిలోని రామప్ప చెరువులో చేపపిల్లల విడుదల చేయాలని నిర్ణయించారు.

ఈ ఏడాది 75 కోట్ల 80 వేల చేప పిల్లలను 21 వేల 568 చెరువులు, రిజర్వాయర్లలో  విడుదల చేస్తున్నారు. మరోవైపు 23 జలాశయాలలో 4 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పోయినా ఏడాది 11  జలాశయాలలో ప్రయోగాత్మకంగా  కోటి రూపాయల ఖర్చుతో రొయ్యల పెంపకం చేపడితే 7 కోట్ల అదనపు ఆదాయం మత్స్యకారులకు లభించిందన్నారు మంత్రి. ఆగస్టు చివారినాటికి మత్స్యకారులకు సబ్సిడీ వాహనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మరోవైపు బర్రెల పంపిణీ గైడ్ లైన్స్ పై సెక్రటేరియట్  నుండి జిల్లా పశు వైద్యాదికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి మంత్రి తలసాని. పాడి పశువుల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిని ప్రోత్సహించేందుకు సబ్సిడీపై బర్రెలు, ఆవుల పంపిణీ చేస్తమన్నారు మంత్రి. ఆగస్టు మొదటి వారంలో కరీంనగర్, మదర్ డైరీ, ముల్కనూర్, విజయ డైరీలలో సభ్యులుగా ఉన్న 2 కోట్ల 13 లక్షల మంది పాడి రైతులకు లబ్ది కలుగుతుందన్నారు మంత్రి.  నచ్చిన ప్రాంతంలో వారు ఎంపిక చేసుకున్న నాణ్యమైన బర్రెలు, ఆవులను కొనుగోలు చేసేలా విధి విధానాలు రూపొందించామన్నారు మంత్రి. బర్రెలు ఆవుల కోనులగోలుపై  రైతులకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు మంత్రి.

 

 

Posted in Uncategorized

Latest Updates