మూఢభక్తి: చిన్నారి శిలగా మారుతుందని

ggసాంకేతికంగా అన్ని రంగాల్లో ముందుకు దూస్కెళ్తున్నా..కొందరు మాత్రం మూఢనమ్మకాలనే విఫరీతంగా నమ్ముతున్నారు. మూఢ భక్తిలో మునిగితేలున్నారు. దీనికి తమిళనాడులో జరిగిన ఓ ఘటనే నిదర్శనం. పుదుక్కోట్టై జిల్లా మనమేల్‌కుడికి చెందిన పళని కుమార్తె 12 ఏళ్ల మాసిల ఆరోతరగతి చదువుతోంది. ఈ చిన్నారికి దైవభక్తి ఎక్కువ. త్వరలో తాను సన్యాసిని, స్వామిని కాబోతున్నానని ఎప్పుడూ చెప్పుకునేది. అయితే ఆమె తల్లిదండ్రులు కుమార్తె మాటలను పెద్దగా పట్టించుకోలేదు. వయసుకు మించిన మాటలాడుతున్న మాసిలను ఓ జ్యోతిష్యుని దగ్గరకు తీసుకెళ్లి జాతకం చూపించారు. జాతకాన్ని చూసిన జ్యతిష్యుడు.. 12వ పుట్టినరోజున చిన్నారి మాసిల ఒక శిలావిగ్రహంగా మారిపోతుందని చెప్పాడు.

ఈ నెల 2న మాసిల 12వ పుట్టిన రోజు కావడంతో ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాలికకు పట్టుచీర కట్టి… పూలతో అలంకరించారు. వడకూర్‌ అమ్మన్‌ ఆలయానికి తీసుకెళ్లారు. రాత్రి పోద్దుపోతున్నా ఎంతసేపటికీ మాసిల శిలగా మారలేదు. దీంతో ఆలయ పూజారి మాసిలకు, ఆమె తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుంచి పంపించేశాడు.

Posted in Uncategorized

Latest Updates