మూవీస్ లిస్ట్: టాప్ టెన్‌లో మ‌హాన‌టి, రంగ‌స్థ‌లం


టాప్ టెన్ మూవీ లిస్టులో మహానటి, రంగస్థలం సినిమాలు చోటు దక్కించుకున్నాయి. టెలివిజన్ కార్యక్రమాలు, వీడియో గేమ్స్ , తదితర వర్గాలకి సంబంధించిన ఆన్ లైన్ డాటాబేస్ సంస్థ ఇంటర్నెట్ మేనేజ్ మెంట్ డాటాబేస్ (IMDB) లేటెస్ట్ గా 2018కి గాను ఇండియాలో టాప్ టెన్ మూవీస్ లిస్ట్ విడుద‌ల చేసింది . ఇందులో టాలీవుడ్ నుండి 4వ స్థానంలో మహానటి, రంగస్థలం 7వ స్థానంలో చోటు  సంపాందించాయి. మ‌హాన‌టి  సినిమా అభిన‌వ నేత్రి సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్క‌గా ఇందులో కీర్తి సురేష్ లీడ్ రోల్ పోషించారు. స‌మంత‌, దుల్క‌ర్ స‌ల్మాన్, విజ‌య్ దేవ‌ర‌కొండ కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించారు.

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన రంగ‌స్థ‌లం సినిమా భారీ విజ‌యం సాధించింది. బాహుబలి తర్వాత అత్యధిక వసూళ్లను సాధించిన రెండో మూవీగా రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత హీరో హీరోయిన్లుగా నటించారు.

టాప్ 10 లో చోటు సంపాదించిన సినిమాలు వరుసగా..అంధాదున్ (హిందీ ),రట్సాసన్ (తమిళం ), 96 (తమిళం ), మహానటి (తెలుగు), బడాయి హో (హిందీ), ప్యాడ్ మ్యాన్ (హిందీ), రంగస్థలం (తెలుగు), స్ట్రీ (హిందీ), రాజీ (హిందీ), సంజు (హిందీ)

Posted in Uncategorized

Latest Updates