మృగాల్లో సైతం…ఆధిపత్య పోరు

Tiger-fightసరిహద్దుల గొడవలు దేశాలకు, మనుషులకే కాదు.. మృగాలకూ సైతం ఉంటాయి తెలుసా ! సాధారణంగా మనుషుల్లో పురుషాధిక్యత కొనసాగించినట్లే పులులు, సింహాల్లో కూడా మగవే ఆధిపత్యం చెలాయిస్తుంటాయి. ఇక్కడ వచ్చిన చిక్కు ఏమిటంటే ఓ మగ పులి అధికారాన్ని దిక్కరించింది ఓ ఆడపులి. ఆడపులి అధీనంలోని ప్రాంతంలోకి ప్రవేశించింది మగపులి అయితే ఆ ఆడపులి తిరగబడింది… అబల కాదు.. అపర కాళికగా మారింది. కుంగ్‌ఫూ పాండాలాగ అంతెత్తున పైకి లేచింది.. ఫైటింగ్‌ పోజు ఎలా పెట్టిందో…చిత్రంలో చూస్తే తెలుస్తోంది. కొంతసేపు రెండూ అరివీర భయంకరంగా కొట్టేసుకున్నాయి. ఆడపులి ధాటికి తట్టుకోలేక మగ పులి వెనక్కి తగ్గింది. ఈ చిత్రాలను కేమ్‌చంద్‌ జోషి అనే ఫొటోగ్రాఫర్‌ రాజస్థాన్‌లోని రణతంబోర్‌ జాతీయ పార్కులో తీశారు.

Posted in Uncategorized

Latest Updates