మెకానిక్ గ్యారేజ్ ఓనర్ గా వీవీ వినాయక్

మెకానిక్ గ్యారేజ్ ఓనర్ సీనయ్య గా డైరక్టర్ వీవీ వినాయక్ మెస్మరైజ్ చేయనున్నాడు. టాలీవుడ్ దిగ్గజ హీరోలతో హిట్లుకొట్టిన వినాయక్ హీరో గా అలరించనున్నారు. దిల్ రాజు నిర్మాతగా, దక్షిణాదికి చెందిన ప్రముఖ సిని దర్శకుడు మణిరత్నంతో కలిసి పనిచేసిన ఎన్. నరసింహ డైరక్టర్ గా వ్యవహరించనున్నఈ చిత్ర షూటింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. దసర పండుగ పురస్కరించుకొని చిత్ర యూనిట్  సీనయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది . ఫస్ట్ లుక్ పోస్టర్ లో వినాయక్ ఎమోషనల్ గా రేంచ్ పట్టుకొని ప్రత్యర్ధుల్ని చితకొట్టేందుకు వెళుతున్నట్లుగా ఉంది. కాగా వినాయక్ దర్శకత్వంలో వచ్చిన చెన్నకేశవరెడ్డి, ఠాగూర్ లాంటి సినిమాల్లో నటించిన శ్రియా శరన్.. వినాయక్ సరసన హీరోయిన్‌గా చేస్తుంది.