మెక్సికోలో కూలిన విమానం: 85మందికి గాయాలు

మెక్సికోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 85మందికి గాయాలయ్యాయి. ఘటన సమయంలో విమానంలో నలుగురు సిబ్బంది సహా 101 మంది ఉన్నారు. మంగళవారం (జూలై-31) దురంగో నుంచి మెక్సికో నగరానికి బయలుదేరిన ఏరో మెక్సికో  విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా దించుతుండగా ఒక్కసారిగా కూలిపోయింది. విమానం క్రాష్‌ల్యాండ్‌ అవ్వగానే అందులో మంటలు చెలరేగాయి. విమానం మంట్లలో చిక్కుకున్నప్పటికీ అందులోని వారంతా ప్రాణాలతో బయటపడగలిగారు. విమానాశ్రయానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే విమానాన్ని దించేశారు. గాయపడిన వారిలో 49 మందిని ఆస్పత్రిలో చేర్పించారు. మిగతా వారికి చాలా చిన్న గాయాలు కావడంతో వారిని ఇళ్లకు పంపించేశామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత విమానం చాలా వరకు మంటల్లో కాలిపోయింది.

 

 

 

 

Posted in Uncategorized

Latest Updates