మెగా షాక్ : తెరపైకి ఉదయ్ కిరణ్ బయోపిక్

uday-tejaసినీ ఇండస్ట్రీలో ఇప్పుడు బయోపిక్ ల హవా నడుస్తోంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వచ్చిన అన్ని జీవితచరిత్రలు హిట్. ఇటీవలే విడుదల అయిన మహానటి సావిత్రి అయితే బంపర్ హిట్. అదే కోవలో ఇప్పుడు మరో సంచలన బయోపిక్ రాబోతున్నది. దివంగత యంగ్ హీరో ఉదయ్ కిరణ్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కథ కూడా రెడీ అయ్యింది. దీనికి దర్శకత్వం వహించటానికి డైరెక్టర్ తేజ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ మూవీని ఏ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఓ పెద్ద నిర్మాత ఈ బాధ్యత చేపట్టనున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్.

ఉదయ్ కిరణ్ ను వెండితెరకు పరిచయం చేసిందే తేజ. చిత్రం, నువ్వునేను, అవునన్నా కాదన్నా సినిమాల ద్వారా స్టార్ డమ్ ఇచ్చింది డైరెక్టర్ తేజ. ఉదయ్ కిరణ్ ను సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ నుంచి యంగ్ స్టార్ హీరోగా ఎదిగిన క్రమం వరకు తేజ పాత్రను విస్మరించలేం. అలాంటి నటుడి జీవితం విషాదంలో ముగిసింది. ఆర్థిక కష్టాలు, వివాహ జీవితంలో ఒడిదుడుకులు, సినీ ఇండస్ట్రీ నిర్లక్ష్యం, వచ్చిన ఆఫర్స్ వెనక్కి వెళ్లటం ఇలాంటి కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడు ఉదయ్ కిరణ్. ప్రస్తుతం సిద్ధం అయిన కథలో చేర్పులు – మార్పులతో త్వరలోనే ఉదయ్ కిరణ్ జీవితం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ వార్తలను డైరెక్టర్ తేజ ఖండించటం లేదు. ఉదయ్ కిరణ్ బయోపిక్ ఉండొచ్చు.. ఈ కాలం కుర్రోళ్లకు ఉదయ్ జీవితం తెలియాల్సిన అవసరం కూడా ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు అంటే ప్రాజెక్ట్ ఉన్నట్లే కదా..

Posted in Uncategorized

Latest Updates